రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి అనే మాట వాస్తవం. చాలావరకు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆత్మరక్షణ ధోరణిలోనే వెళ్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విషయంలో అధికార వైసీపీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లో చేరడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది. ఎంతో అనుభవం ఉన్న నేత మళ్ళీ ఇలా మాట మార్చడం ఏంటి అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో గతంలో అవసరం లేకపోయినా గొడవ పెట్టుకుని చంద్రబాబునాయుడు నుంచి బయటకు వచ్చి అనవసరం గా ఓడిపోయిన పరిస్థితి మనం చూశాం.

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్డీఏ లోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గత వారం రోజులుగా తీవ్రంగా కష్టపడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఆయన లాబీయింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉండే బీజేపీ రాజ్యసభ ఎంపీల ద్వారా ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. కర్ణాటకకు చెందిన ఒక రాజ్యసభ ఎంపీతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారని బిజెపి జాతీయ అధ్యక్షుడు ద్వారా కేంద్ర పెద్దలతో చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏ లో చేరితే ఖచ్చితంగా చులకన అయ్యే అవకాశాలు ఉంటాయి అని తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: