ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో భజన చేయడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రమేష్ కుమార్ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పదే పదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన ను కాపాడే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 టిడిపి కార్యకర్తలు కూడా చంద్రబాబు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ముందు నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తన మనిషిగా చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని చిత్రీకరిస్తున్నారని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ సంగతి తెలిసి కూడా చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తించడం లో టీడీపీ సీనియర్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు ఇచ్చే సలహాలు చంద్రబాబు పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం అవుతుంది. భవిష్యత్ పరిణామాలు ఇదే విధంగా ఉంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడవచ్చు అని అంటున్నారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు మూడు నెలల తర్వాత పదవి విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో ఆయన భజన చేస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగూ పోలీసు అధికారులు ఉంటారు. కాబట్టి పోలీసులు తెలుగుదేశం పార్టీ విషయంలో సీరియస్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: