మూడు నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది సార్లు భేటీ లు జరగగా ఫలితం మాత్రం శూన్యం.. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రైతు సంఘాలు భీష్మించుకు కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సవరణలు చేయడానికే ఎక్కువగా సిద్మవుతూ ఈ భేటీ ని రోజు రోజు కి పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఎవరికీ వారి పట్టుదలతో ఉండడంతో చలిని సైతం లెక్క చేయకుండా సామాన్య రైతులు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రద్దు చేయడానికి ప్రభుత్వం అస్సలు సిద్ధంగా లేదని తెలుస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌  మాట్లాడుతూ వ్యవసాయ చట్టానికి చాలామంది రైతులు ఆరోపిస్తున్నారని కొద్దీ మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అంటున్న అయన మాటల్లో అర్థం అదే అనిపిస్తుంది. కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాల వల్ల రైతుల కు మరింత లాభం చేకూరుతుందని, దీనివల్ల వారి ఆదాయం మరింత పెరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొనడం రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలుపుతోంది.

ఇకపోతే రెండు నెలలుగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ఉద్రేకాలకు లోను కాకుండా రైతన్నలు కొనసాగిస్తున్న నిరసన చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జాతి పిత మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుస్తూ స్వాతంత్ర పోరాటాన్ని అన్నదాతలు తలపిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో చేయ తలపెట్టిన ర్యాలీపై సుప్రిం కోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం రైతులు చేస్తున్న ఉద్యమం ఎంత శాంతియుతంగా సాగుతుందో తెలియజేస్తోంది. ర్యాలీకి అనుమతి విషయం పోలీసుల పరిధిలోనే ఉందని సుప్రిం చెప్పగా.. పోలీసులు ర్యాలీకి అనుమతించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: