గ్రేటర్ హైదరాబాద్ ఫలితం రాష్ట్రంలో ఒక్కసారిగా అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఈమధ్యనే జరిగిన ఈ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది.. ఆ సంబరాలు ఇప్పటికీ ముగిసిపోలేదనంటే బీజేపీ పార్టీ ఈ విజయాన్ని ఎంతలా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలం చూస్తుంటే తెరాస పార్టీ కి ఓ వైపు భయం వేస్తుంది అని చెప్పొచ్చు..  పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది.

దుబ్బాక విజయం తరువాత దూకుడు పెంచిన కాషాయ పార్టీలో గ్రేటర్ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను సైతం కొల్లగొట్టి సత్తాచాటుకున్న బీజేపీ అధికార పార్టీని మేయర్ పీఠానికి చేరువకానివ్వలేదు.  48 కార్పోరేటర్ స్థానాలను కైవసం చేసుకొని సెకండ్ పొజిషన్ లో నిలబడిన బీజేపీ టీఆర్ఎస్ కంటే కూడా అత్యధిక ఓట్లను రాబట్టుకోగలిగింది. ఇకపోతే ఫిబ్రవరి పదకొండో తేదీన మేయర్ ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఉదయం కార్పొరేటర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక ఉంటుంది.

కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో ఓటర్లు కలిసినా… మ్యాజిక్ మార్క్ కావాల్సిన వంద దాటడం లేదు. ఈ కారణంగా మేయర్ ఎన్నికను నిర్వహించరని.. ప్రత్యేక అధికారుల పాలనను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. వాస్తవానికి గ్రేటర్‌లో మేయర్ సీటు దక్కించుకునేందుకు ఒక్క టీఆర్ఎస్‌కు మాత్రమే చాన్స్ ఉంది. ఇంకెవరికీ లేదు. అయితే ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఎఁఐఎం సాయం చేయాల్సి ఉంటుంది. మజ్లిస్ మద్దతివ్వడమో… అసలు ఎన్నికకు దూరంగా ఉండటమో చేయాల్సి ఉంది. ఎలా చేసినా… మజ్లిస్ సాయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిటీఆర్ఎస్‌కు ఇష్టం లేదు. అందుకే…మేయర్ అభ్యర్థిని ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్దతిలో మార్పులు చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: