ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకునే నిర్ణయాలు సంచలనంగా ఉన్నాయి. రేపు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను, ఒక ఐపీఎస్ అధికారిని విధుల నుంచీ తప్పించాలని ఏపీ సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసారు. పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించే దిశగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేసారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఛార్జ్ అప్పంగించి విధుల నుంచీ రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ని విధుల నుంచీ తప్పిస్తూ, చిత్తూరు ఎస్పీకి ఛార్జ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ పలమనేరు, డీఎస్పీ శ్రీకాళహస్తి లను ఎన్నికల విధుల నుంచీ తప్పించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసారు. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐ లను ఎన్నికల విధుల నుంచీ తప్పించాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో...

సీఈసీకి ఉండే అధికారాలే ఎస్ఈసీకి ఉంటాయి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేసారు.  అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాలి అని,  ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదు అని స్పష్టం చేసారు.  నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా చర్యలు తప్పవు  అని ఆయన హెచ్చరించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు  తీసుకుంటామని అన్నారు. ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చినా సరే ఎస్ఇసి కార్యాలయం కు పంచాయతీ రాజ్  ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ లు హాజరు కాలేదు. వేచి చూసి కార్యాలయం నుండి ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: