ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై యస్ జగన్ ఇప్పుడు పట్టుదలకు పోతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని కొన్ని విషయాల్లో సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సీఎం జగన్ వైఖరి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజల్లో వైసీపీ నేతలు చులకనవుతారు అనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంది.

అంతేకాకుండా అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీఎం జగన్ వెనక్కు తగ్గే పరిస్థితి కనబడటం లేదు. అటు అధికారులు సీఎం జగన్ కు ఎన్నికల సంఘానికి మధ్య నలిగి పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అయినా నిర్వహించాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టుదలగా వ్యవహరిస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించకుండా అధికారులను ఇప్పుడు సీఎం జగన్ కట్టడి చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.

తాజాగా పంచాయతీరాజ్ శాఖ అధికారుల విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటనేది అర్థం కావటంలేదు. రమేష్ కుమార్ ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ తో పాటుగా ప్రధాన కార్యదర్శికి కూడా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. కిందిస్థాయి అధికారులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కలిసి ఒక లేఖ కూడా సమర్పించారు. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎన్నికల సంఘం మాట వినకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రమేష్ కుమార్ కోర్టుకు వెళితే రాజ్యాంగ సంక్షోభం వచ్చినా సరే ఆశ్చర్యం లేదు. మరి జగన్ ఇప్పటికైనా వీరి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: