ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బంది పడుతున్నది. ఇబ్బంది పడుతున్న నేతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా జేసీ కుటుంబం అధికార పార్టీ చేతిలో ఇబ్బందులు పడుతోంది.

అలాగే భూమా కుటుంబం కూడా గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. వీరికి న్యాయ సహాయం అందించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా సరే అనేక ఇబ్బందులు ఆ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కానీ కొంతమంది నేతలు విషయంలో సన్నిహితంగా మరికొంతమంది నేతల విషయంలో నా వాళ్ళు కాదు అన్నట్టు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంతమందికి మాత్రమే మద్దతు ఇస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. భూమా అఖిలప్రియ జైల్లో ఉన్నా సరే చంద్రబాబునాయుడు ఆమెకు పరోక్షంగా ప్రత్యక్షంగా గాని సహాయ సహకారాలు అందించలేదు. కనీసం ఆమెకు మద్దతుగా కూడా చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కానీ జేసీ కుటుంబం మాత్రం అండగా నిలిచింది. జేసీ పవన్ రెడ్డి ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొందరు నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక కొంతమంది నేతలు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే ఇతర పార్టీల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: