ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పట్టుదలకు పోవటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యే లు కొంత మంది ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ చాలా వరకు బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కొన్ని ఎకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు గనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీఎం జగన్ అన్ని విధాల ఇబ్బందికరంగా ఉంటే ఆ ఏకగ్రీవమైన వాటిని  రద్దు చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే  ప్రచారం జరుగుతుంది.

ఒకవేళ ఏకగ్రీవాలు రద్దు చేస్తే వైసీపీ కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. దాదాపు 25 శాతం ఏకగ్రీవమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దీనితో వైసీపీ ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కష్టపడి ఏకగ్రీవం అయితే ఇప్పుడు మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీఎం జగన్ పట్టుదలగా వెళ్ళడంతో నిమ్మగడ్డ కూడా కక్ష సాధింపుగా వెళ్తే ఎకగ్రీవాలను  రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే అనేక ఇబ్బందులు ఉంటాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు పోలీసులు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అధికార పార్టీకి సహకరిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని భావించినా లేదా సీసీ కెమెరాలతో ఎన్నికలు నిర్వహించాలని భావించినా సరే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్పలేక పైకి కార్యకర్తలు వద్ద కూడా అనలేక ఆవేదన వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన అర్థం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే జగన్ విధానాల దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యేలు కంగారుపడుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే జగన్ జాగ్రత్తపడతారా ఇదేవిధంగా ఉంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: