కరోనా లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి .. అయితే ఈ విద్యా సంవత్సరం ఏమైపోతుందా అని తల్లితండ్రులు ఆందోళన చెందడంతో కొన్ని నెలల కిందట దూరదర్శన్ లో  మరియు ఆన్లైన్ లో విద్యార్థులకి పాఠాలను చెప్పడం మొదలైంది .. ఆలా కొన్ని నెలల అలాగే కొనసాగించిన తెలంగాణ  ప్రభుత్వం కొన్ని రోజుల ముందు  గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది .. ఫిబ్రవరి లో పాఠశాలలు తెరుచుకోవచ్చనే శుభవార్తని వినిపించింది .. దీంతో తెలంగాణ కొన్ని నెలల తర్వాత మూతపడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల నుంచి  పాఠశాలలు తెరిచేందుకు ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు కొన్ని నెలల తర్వాత ఫిబ్రవరి లో  బడి గంటలు మోగడం  దాదాపు ఖాయం  అయిపొయింది  .. ఈ నేపథ్యంలో బడులు తెరవడం పై  తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొమ్మది, పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అకడమిక్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాల మేరకు.. ఫిబ్రవరి నుండి కేవలం  9,10 తరగతుల విద్యార్థులకు తరగతులు జరగనున్నాయి. ముందు నుంచే ఉన్న పాఠశాల పని గంటలని విద్యాశాఖ నిర్ణయించారు. ఇక  జంట నగరాల్లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకూ పాఠశాలలు నిర్వహించాలని విద్యా శాఖ తన  ఉత్తర్వుల్లో పేర్కొంది ..

పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని.. పాఠశాలకు పంపడం ఇబ్బందికరంగా భావిస్తే టీశాట్, దూరదర్శన్‌లో వచ్చే ఆన్‌లైన్ తరగతులకు ఆ విద్యార్థులు  హాజరుకావొచ్చని విద్యాశాఖ తెలిపింది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఉదయం పూట,9 వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట ఈ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయి.  

అలాగే ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పదో తరగతి పరీక్షల తేదీలను కూడా విద్యా శాఖ ప్రకటించింది.. మే 17 వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని   పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్చువల్ పద్ధతిలో గత నాలుగు  నెలలుగా తరగతులు జరిగాయని.. ఫిబ్రవరి ఒకటి నుంచి మే వరకు పాఠశాలలు జరుగుతాయని పేర్కొంది.అయితే తల్లిదండ్రుల అనుమతి తోనే విద్యార్థులు పాఠశాలకు హాజరవ్వాలని..హాజరు మాత్రం తప్పనిసరి కాదని తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: