ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఆయన కుటుంబానికి సహాయం చేసారు. ఆర్ధికంగా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పంచాయతీ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలను మేము హ్యాండిల్ చేయలేమని వైసీపీ చెప్పటం సరికాదు అని అన్నారు. వాళ్లు చెప్పే సాకులు బాగలేవు అని మండిపడ్డారు.

కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేడుకలు జరుపుకోలేదా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. వ్యక్తి కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకూడదు అని ఆయన సూచించారు. ఎన్నిసార్లు కోర్టులకు వెళ్తారు అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ ను, జడ్జిలను కులాల పేరిట దూషిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికలను వ్యతిరేకించటంపై పునరాలోచించాలి అని ఆయన సూచించారు. మొదటి వాక్సిన్ ఆరోగ్య సిబ్బందితో పాటు ఉద్యోగులకు ఇవ్వాలి అని ఆయన సూచించారు.

పంచాయతీ ఎన్నికలు జరగాలనే మేము కోరుతున్నాం అని అన్నారు. నాకు వ్యక్తిగత విభేదాలు ఏ పార్టీలతో లేవు అని పవన్ అన్నారు. బీజేపీతో కొంత గ్యాప్ ఉన్నది వాస్తవమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు చట్టాలపై పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్ముతా అని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అందరి మద్దతుతోనే వ్యవసాయ చట్టాలు తెచ్చారు అని అన్నారు. ముందు మద్దతు ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వ్యతిరేకత దృష్ట్యా భయపడుతున్నారని పవన్ అన్నారు. నిరసనలు చేస్తున్న రైతులు చాలా కష్టాలు పడుతున్నారనేది వాస్తవం అన్నారు. రైతుల్లో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేయాలి అని ఆయన సూచించారు. జగన్ రెడ్డి ఒక మంచి చట్టం తెచ్చినా ఆమోదించా అన్నారు. ఏపీలో ఈడబ్ల్యుఎస్ స్కీమ్ అమలు చేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: