ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంటే విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న తరుణంలో టీడీపీ నేతలు కొన్ని డిమాండ్ లను పెడుతున్నారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు,  పాలకులు వారి తలల పైకెక్కి ఆడుతున్నారు అని విమర్శించారు.

పాలకులు తమకు 151 మంది ఎమ్మెల్యేలున్నారని విర్ర వీగుతుంటే, అధికారులు వారికి వత్తాసు పలుకుతూ వ్యవస్థల నాశనానికి తమ వంతుగా సహకరిస్తున్నారు అని వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కమిషనర్ టీడీపీ మనిషని, చంద్రబాబు చెప్పినట్లు వింటాడనేది గోబెల్స్ ను మించిన విషప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు. తొలిసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి, ఇప్పటి వరకు టీడీపీ సహా, మిగతా రాజకీయ పక్షాలు చేసిన అనేక ఫిర్యాదులపై నిమ్మగడ్డ స్పందించలేదని ఆయన అన్నారు.

ఓటర్ల జాబితాలో టీడీపీ వారి పేర్లే లేవని చెప్పినా నిమ్మగడ్డ చర్యలు తీసుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలకుల అండ చూసుకొని తప్పుల మీద తప్పుల చేసిన అధికారులపై, ఎస్ఈసీ ఆరంభంలోనే చర్యలు తీసుకొని ఉండుంటే, నేడు వారంతా ఆయన్ని ధిక్కరించే పరిస్థితి ఉండేది కాదు అని అన్నారు. 5న్నరకోట్ల జనాభాలో 3 లక్షల70 వేల మందికి వ్యాక్సినేషన్ వేస్తే, దాన్ని ఎన్నికలకు అడ్డుగా అధికారలు ఎలా చెబుతారు? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు, బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చేస్తేనే, ప్రజల్లో ఎన్నికలపై, పాలకులపై  నెలకొన్న భయాలు తొలగుతాయని ఎన్నికల కమిషనర్ గుర్తించాలి అని దీపక్ రెడ్డి హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: