ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏమో గాని అధికార పార్టీ నేతలు మాత్రం మీడియా ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల కమీషనర్ తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన మాటే చెల్లాలన్నట్టు రాజ్యాంగ వ్యవస్థలకి భిన్నంగా వ్యవహారిస్తున్నారు అని మండిపడ్డారు.  ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా వ్యహారం ఉంది అని ఆయన మండిపడ్డారు.

అధికారులని తొలగిస్తున్నారు‌ అని... ఎవరి కోసం ఈ ప్రాపకం అని ఆయన ప్రశ్నించారు. ఆదూర్ధా ఎందుకు?  పదవిచ్చిన చంద్రబాబు కోసమా? అని బొత్సా ప్రశ్నించారు. మీరు క్యాంపెయిన్ చేసినా 10 శాతం మంది ప్రజలురారు అని అన్నారు. రమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా అన్ని ఆయన వ్యాఖ్యానించారు. ఏకగ్రీవ పంచాయతీలపై దృష్టిపెడుతారట... ఎంత దారుణం అని ఆవేదన వ్యక్తం చేసారు. అది చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు.

ఆయన అద్దాల మేడలో ప్రెస్ మీట్ పెడుతారు అని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం ప్రజల దురదృష్టం, ఖర్మ అని ఆయన అన్నారు. బాబు హయాంలో ఎన్నికలు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. అప్పుడు బాధ్యత గుర్తుకి రాలేదా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ... గత మూడు సంవత్సరాల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని అన్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ రమేష్ అప్పట్లో ఎన్నికలు నిర్వహించ లేదు అని విమర్శించారు. కుట్ర రాజకీయాల్లో భాగంగా గత ఏడాది మార్చిలో ఎన్నికలు వాయిదా వేశారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలి ఉంది అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: