కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యా వ్యవస్థపై సర్వత్రా కూడా ఆందోళన ఉంది. ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారో కూడా చాలా మందికి అసలు స్పష్టత రావడం లేదు. చాలా వరకు కూడా ఇప్పుడు విద్యార్ధులు ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా భయం అనేది చాలా మందిలో ఇంకా అలాగే ఉంది. అందుకే స్కూల్స్ కి వెళ్ళే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నా సరే తల్లి తండ్రులు మాత్రం ఇప్పుడు స్కూల్స్ కి తమ పిల్లలను పంపడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇదిలా ఉంటే...

పాఠశాల విద్యాశాఖ నూతన అకాడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్-‌2020-21 విడుదల చేసారు తెలంగాణా విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రారాంచంద్రన్‌. 9, 10 తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆమె పేర్కొన్నారు. మే 26 పాఠశాల పని దినం చివరి రోజు అని తెలిపారు. మే 27 నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 15 నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు అని తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు అని తెలిపారు. మే 7 నుంచి మే 13 వరకు ఎస్‌ఏ పరీక్షలు అని పేర్కొన్నారు.

మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు అని వివరించారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 30 శాతం సిలబస్‌ పూర్తి చేసామని చెప్పారు. 70 శాతం సిలబస్‌కు స్కూళ్లు, ఆన్‌లైన్‌ ద్వారా సిలబస్‌ చెప్తున్నామని అన్నారు. జిల్లాల్లో ఉ. 9.30 గంటల నుంచి సా. 4.45 గంటల వరకు స్కూళ్లు ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఉ. 8.45 గంటల నుంచి సా. 4 గంటల వరకు స్కూళ్లు అని చెప్పారు. విద్యార్థులు తప్పని సరిగా స్కూల్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: