ఎన్నో శతాబ్దాల చారిత్రక ప్రాధాన్యత మన భారతదేశం సొంతం. ఎన్నో మతాలు, భాషలు అలాగే మరెన్నో జాతులు, కులాల సమాహారం ఈ భారతదేశం. అలాంటి సువిశాల భారతదేశానికి కేవలం ఒకటే రాజధాని ఎందుకు ఉండాలనే ప్రశ్నను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ లేవనెత్తారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని, రొటేటింగ్ పద్ధతిలో వాటిని వాడుకోవాలని సూచించారు. శనివారం (జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రాజధాని అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
 

‘ఇండియాకు నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని నేను కోరుకుంటున్నా. గతంలో బ్రిటిషర్లు కోల్‌కతా రాజధానిగా యావత్ దేశాన్ని పరిపాలించారు. మన దేశానికి ఇప్పుడు ఒకటే రాజధాని ఎందుకు ఉండాలి?’ అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఇప్పటికే కొంత మంది డిమాండ్ చేస్తుండగా.. మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేసి ఈ 4 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. కోల్‌కతా నగరానికి బ్రిటిషర్ల కాలం నుంచి ప్రత్యేక చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఈ నగరం వర్తక, వాణిజ్యానికి, బ్యాంకింగ్ రంగ సేవలకు ప్రసిద్ది గాంచింది. ప్రధాన బ్యాంక్ శాఖలన్నీ కోల్‌కతా కేంద్రంగానే ప్రారంభమయ్యాయి. విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండటం కూడా ఈ నగరానికి కలిసొచ్చిన అంశం. ఆంగ్లేయుల పాలనా కాలంలో 1772 నుంచి 1911 వరకు కోల్‌కతా రాజధానిగా ఉంది. అంతకుముందు మొఘల్స్ పాలనా కాలంలో ముర్షిదాబాద్ బెంగాల్ రాజధానిగా ఉండేది. 1772లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ రాజధానిని ముర్షిదాబాద్ నుంచి కోల్‌కతాకు తరలించారు. పరిపాలనా కార్యాలయాలన్నింటినీ కోల్‌కతాకు తరలించారు. ఇప్పుడు దీదీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చేసిన ఈ నాలుగు రాజధానుల ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: