ఫాక్లాండ్ దీవుల్లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. ఫాక్లాండు దీవుల్లోని స్టాన్లీ నగరానికి దక్షిణాన 1125 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైందని భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ఉపరితలం నుంచి 10కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. ఫిలిప్పీన్స్ లోని దావో నగరంలో గురువారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అలాగే అర్జెంటీనాలోనూ భూమి కంపించింది. ఇటీవల తరచూ పలుప్రాంతాల్లో భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.దక్షిణ స్కాంట్లాండులోని దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది. చీలీ రాజధాని నగరమైన సాంటిగోలో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు చీలీ అంతర్గత శాఖ మంత్రి చెప్పారు.



కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 55మందికి పైగా మంది మరణించగా, వందల  మంది గాయపడ్డారని ఆ దేశ విపత్తు సంస్థ  తెలిపింది. ఇండోనేషియాలోని మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్లు దూరంలో సులవేసి దీవుల్లో  6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం దాదాపు ఏడు సెకన్ల పాటు సంభవించినట్లు అధికారులు తెలిపారు.  మృతుల్లో వెస్ట్‌ సులవేసి రాష్ట్రంలోని మముజు నగరంలో 34, దక్షిణ ప్రాంతంలో మరో ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యిందన్న విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇంటి శిధిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులను వెలికి తీయడానికి సహాయ సిబ్బంది ప్రయత్నించారు. ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ముద్రాల‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో వరుస భూకంపాలు సంభ‌విస్తున్నాయి.
గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంలో  స‌ముద్రాల‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులు పెరిగిన‌ట్లు అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: