ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎన్నో తేడాలు ఉండేవి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలు కేవలం వంటింటికి  మాత్రమే పరిమితం కావాలని చదువుకోవడం లాంటివి అసలు చేయకూడదు అని తల్లిదండ్రులు నిబంధనలు పెట్టేవారు. ఇక ఉద్యోగం అనే పేరు ఎత్తితే చాలు అదో పెద్ద నేరం చేసిన విధంగా భావించేవారు తల్లిదండ్రులు. కానీ క్రమక్రమంగా ఆడపిల్లలు తమ ఆధిపత్యాన్ని సాధిస్తూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో కూడా ఎంతో విజయవంతంగా మగవారికి తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా మహిళలు సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే మహిళల ఈ మధ్యకాలంలో అనిచి వేతకు చాలా తక్కువగానే గురవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది మహిళలు ఓ వైపు భర్త పిల్లలను చూసుకుని  ఇంటి బాధ్యతలు చేపట్టడంతో పాటు మరోవైపు ఉద్యోగం వ్యాపారం చేస్తూ వారికి తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా మహిళలు కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు అన్నది ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికి కూడా ఎంతో మంది ఆడ పిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు అన్నది ఈ సర్వే చెబుతోంది.



 మొబైల్ వినియోగం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వెనకబడి ఉన్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దేశంలో 42% మంది టీనేజీ అమ్మాయిలకు రోజులో  కేవలం ఒక్క గంట మాత్రమే మొబైల్ చూసేందుకు తల్లిదండ్రులు అనుమతి ఇస్తున్నారని.. ఇటీవల నిర్వహించిన సర్వే చెబుతుంది. కర్ణాటకలో ఎక్కువ మంది అమ్మాయిలు మొబైల్స్ వాడుతూ ఉంటే హర్యానాలో మాత్రం అతి తక్కువ మంది అమ్మాయిలు మొబైల్స్ వాడుతున్నారని  తేలింది. మొబైల్స్ వాడటం వల్ల అమ్మాయిలు దారి తప్పుతున్నారు అని తల్లిదండ్రులు ఇలా కండిషన్ పెడుతున్నట్లు సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: