డబ్బులు సంపాదించడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బులు సంపాదించడానికే ఎంతోమంది కష్టపడి పోతూ ఉంటారు కోట్లు సంపాదించడం అంటే అది కొంత మందికి మాత్రమే సాధ్యమయ్యే పని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కోట్లల్లో సంపాదించినప్పటికీ వందలు, వేల కోట్లలో సంపాదించడం మాత్రం సాధ్యమయ్యే పనికాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎవరికో కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది అదృష్టం బాగా కలిసి వచ్చి  కష్టపడకుండానే కోటీశ్వరుడు గా మారిపోతున్న ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ మధ్య కాలంలో ఎంతోమంది లాటరీ ద్వారా అదృష్టం వరించి చివరికి ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు గా మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలా అదృష్టం వరించింది. అయితే ఇది మామూలు అదృష్టం కాదండోయ్...  ఒక్క దెబ్బతో వేల కోట్లకు అధిపతి గా మారిపోయాడు ఒక సామాన్యుడు. సాధారణంగా ఇప్పటివరకు మనం వందకోట్ల లోపే డబ్బులు లాటరీ ద్వారా గెలుచుకున్న సంఘటనలు చూసాం కానీ.. ఇక్కడ మాత్రం ఒక్క లాటరీ తో ఏకంగా వేల కోట్ల రూపాయలను గెలుచుకుని..  కోటీశ్వరుడు గా కాదు కుబేరుడి గా మారిపోయాడు ఇక్కడ ఒక వ్యక్తి. యుఎస్ లో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.




 యూఎస్ లో  ఒక అదృష్టవంతుడు ఏకంగా లాటరీలో వందల కోట్ల డాలర్లు గెలుచుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అతడు గెలుచుకున్న డబ్బు విలువ భారత కరెన్సీలో 7300 కోట్లు. ఏంటి ఆశ్చర్య పోయారు కదా..  కానీ నిజంగానే ఒక్క లాటరీ తో అతని దశ దిశ తిరిగి పోయింది అని చెప్పాలి. అయితే యూఎస్  చరిత్రలోనే ఇది అతిపెద్ద లాటరీ కావడం గమనార్హం.  కాగా  ఈ లాటరీ తీసేందుకు  రెండు రోజుల ముందే లాటరీ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.  లాటరీ విజేత జాక్పాట్ కొట్టేశాడు అని అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: