ఈ మధ్య ఏ పని చేయాలన్నా కూడా ఆన్ లైన్ లో చేస్తారు. మొత్తం డిజిటల్ మీద ఆధారపడి ఉంటుంది. మంచికైన , చెడు కైన కూడా ఆన్ లైన్ లో చేస్తారు. ఇకపోతే ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు. వీటి ద్వారా చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఎన్నో అక్రమాలు వెలుగు చూసారు. ఈ యాప్ ల పై తాజాగా పోలీసులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లపై ఇంటర్‌పోల్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. 



ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల తో ప్రజలను మోసం చేశారని ఇంటర్‌పోల్ కు పలు దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ పోలీసు సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ ల సాయంతో ప్రజలను మోసగించే మోడస్ ఆపరేషన్ పై ఇంటర్ పోల్ ప్రజలను అప్రమత్తం చేసింది. 194 సభ్యదేశాలకు ఇంటర్ పోల్ ఈ హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ వల్ల మీరు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు కోల్పోవచ్చని హెచ్చరించింది.



డేటింగ్ అనువర్తనం ద్వారా వ్యక్తులతో పరిచయం పెంచుకొని, నమ్మకం ఏర్పడ్డాక ట్రేడింగ్ యాప్ డౌన్ లోడ్ చేసి బ్యాంకు లావాదేవీలు చేయమని కోరతారని, అప్పుడు మీ ఖాతాలోని డబ్బును కొల్లగొడతారని ఇంటర్ పోల్ వివరించింది. ఇలా చాలా మంది పర్సనల్ అకౌంట్లను హ్యాల్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొన్ని సూచనలను విడుదల చేశారు.మోసపూరిత డేటింగ్ యాప్ లను ప్రజలు నమ్మవద్దని సూచించింది. పరిచయం లేని వ్యక్తి మిమ్మల్ని సంప్రదించినపుడు అప్రమత్తంగా ఉండాలి.డబ్బును బదిలీ చేయడానికి ముందు రెండు సార్లు ఆలోచించండి.మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు.. అప్పుడే కేటుగాళ్ల మోసాన్ని అరికట్టడానికి సులువుగా ఉంటుందని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: