ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ ఎన్నికల సంఘం ఏర్పడిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు ఇతర ఎన్నికల విధులలో పాల్గొనాల్సిన అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పనుల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదని ముందుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా వ్యాక్సిన్ సహా అన్ని అంశాలు వీడియో కాన్ఫరెన్స్ లోనే చర్చిద్దామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరలా ఆయనకు లేఖ రాశారు.

 ఒకరకంగా ఉద్యోగులు అంతా కావాలనే ఎన్నికల సంఘం సమావేశానికి హాజరు కాకుండా ఉండిపోయారు. దీంతో సర్వీస్ రూల్స్ మొత్తం తెలిసిన వ్యక్తిగా తనకు సహకరించని అధికారులు తప్పు చేశారని సాక్ష్యాలు సేకరించిన నిమ్మగడ్డ వాటిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఉద్యోగులు హాజరు కాకపోవడానికి చెప్పిన కారణం ఏమిటంటే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేకపోయామని. నిజానికి 13 జిల్లాల అధికారులకు ఒకేసారి టెక్నికల్ ఇష్యూస్ రావు. ఇది కావాలనే బహిష్కరించినట్లు అనిపిస్తోంది. దీంతో టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు లేవని ఆధారాలు తీసుకుని నిమ్మగడ్డ 5 గంటల వరకు కార్యాలయంలోనే ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మరో అంశం చర్చనీయాంశంగా మారింది. 

అదేంటంటే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ని రేపు ఉదయం జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే తమకు వ్యతిరేకంగా వస్తున్న అన్ని తీర్పులు విషయంలోనూ జడ్జిలకు సైతం వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ కులం అంటగడుతూ వెళ్ళింది. రేపు చట్టప్రకారం లావు నాగేశ్వరరావు బెంచ్ ఏపీ ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఆయనకు కూడా కులం అంటగట్టి వ్యాఖ్యలు చేస్తారేమో అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు కులం అంటగడుతూ ఏకంగా రాష్ట్ర సిఎం జగన్ కామెంట్స్ చేయగా లేనిది వీరు సైలెంట్ గా ఉంటారని చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: