మాట తప్పను మడమ తిప్పను అనేది వై యస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకునే మాట. కానీ ఇప్పుడు ఆయన అనేక విషయాల్లో మాట తప్పి మడమ తిప్పాడు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు జగన్. ఈ యాత్ర చేశాక తనకు ప్రజల కష్టాలు మరింత దగ్గరగా చూసే అవకాశం లభించిందని ఇకమీదట వారికి కష్టాలు లేకుండా చేస్తామని జగన్ చెప్పారు. ఈ పాదయాత్రలోనే జగన్ అనేక కుల సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. అందరిలానే బ్రాహ్మణ కుల పెద్దల తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సమయంలో బ్రాహ్మణ పెద్దలు అనేక కోరికలు జగన్ ను కోరారు. అన్నిటినీ విన్న జగన్ మ‌న ప్ర‌భుత్వం రాగానే న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 


కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జ‌గ‌న్ చేసింది ఏమీ లేద‌ని అంటున్నారు. నిజానికీ అప్పటికే వారికి గత ప్రభుత్వాలు ఏవి ఇవ్వని విధంగా చంద్రబాబు అనేక నిధులు కేటాయించారు. దేశంలో ఎన్నడూలేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల మనసు దోచుకున్నారు. అయినప్పటికీ తాను అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పిన జగన్ ని బ్రాహ్మణులు నమ్మారు. అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్ల నిధులు సంగతి దేవుడెరుగు గతంలో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఓసీల సంఖ్య తక్కువే. అందులో బ్రాహ్మణులు మూడు నుంచి నాలుగు శాతం ఉంటారు. 


అయితే వీరి కంటే తక్కువ సంఖ్యలో ఉన్న వైశ్యులకు, క్షత్రియులకు మంత్రి పదవులు దక్కాయి కానీ బ్రాహ్మణులకు ఒక్క మంత్రి పదవి లేదు. ఏదో తూతూమంత్రంగా ఈ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతినీ డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే జగన్ తమ పట్ల చేస్తున్న ఏ కార్యక్రమం విషయంలోనూ బ్రాహ్మణులు సంతృప్తిగా లేరు. ఒకరకంగా బ్రాహ్మణ వర్గాలకు ఎలైట్ పీపుల్ అనే పేరు ఉంది. మిగతా కులాలవారందరూ వీరు చెప్పిన మాటలను ఆలకిస్తారు. స్వతహాగా మిగతా కులాల వారు కూడా వీరిని జ్ఞాన సంపన్నులు గా భావిస్తారు. ఇప్పుడు వీరి విషయంలో లోటు చేసి జగన్ తన కొంప తానే మునిగేలా చేసుకుంటున్నాడు అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వీరికి మంచి చేస్తే వీరు జగన్ గురించి నలుగురికి మంచి చెప్తారు, కానీ వీరికే ఆయన పంగ నామాలు పెట్టాలని చూస్తున్న సమయంలో వీరు జగన్ గురించి నలుగురికి మంచి ఎలా చెబుతారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన జగన్ తన ఓటమికి తానే కారణమవుతాడనే విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.  


బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే.

లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: