ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సిఎం జగన్ కక్ష సాధింపుతో వెళ్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా సరే సిఎం జగన్ మాత్రం స్పందించడం లేదు. ఉద్యోగ సంఘాల ద్వారా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిజెపి కీలక నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని వింటున్నాo అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు గొడవ ఆలయాల కూల్చివేతను తప్పితే మరొకటి వినిపించడం లేదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇచ్చిన మెజారిటీ  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  డేంజర్ గా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. పవర్ గేమ్,  కులం,  మతం, గుండాయిజం మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఉంటే ఇండియా ఎలా ముందుకు వెళుతుంది అని ప్రశ్నించారు.

ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆలోచించాలి అని కోరుతున్నాం అని అన్నారు. విశాఖలో because india comes first  పుస్తక  ఆవిష్కరణ చేసిన రాంమాధవ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కొద్ది మంది రైతులు, నాయకుల  వ్యవహరిస్తున్న తీరు.. సరిగా లేదు అని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుంది అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. రైతులు ముందుకు వచ్చిముందుకు వచ్చి చర్చలు జరపాలి అని ఆయన కోరారు. కొంతమంది చేతుల్లో ఉండే   నియంత్రణ  నుంచి బయటకు తీసుకు వచ్చేందుకే వ్యవసాయ సంస్కరణలు అని స్పష్టం చేసారు. ఏం జరిగినా రాజ్యాంగపరమైన వ్యవస్థల ద్వారా జరగాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: