ఎంతో మంది బ్యాంకు ఉద్యోగాన్ని సాధించడానికి ఎన్నో రోజుల నుంచినిరీక్షణ గా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పలుమార్లు బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటించిన సమయంలో.. ఇక ఎంతోమంది ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగాలు పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారికి ఇటీవలే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పేది. భారీగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  అది కూడా కేవలం పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాలను ప్రకటించడంతో ప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.


 దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో 241 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యి  ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం..https://www.rbi.org.in/ వెబ్ సైట్ కి వెళ్లి నిరుద్యోగులు తెలుసుకోవచ్చు.


 అయితే మొత్తం ఖాళీల సంఖ్య 241 కాగా..  రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  ఇకజనవరి 1 2021 నాటికి.. 25 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులు అయిఉండాలి.  ఎస్సీ ఎస్టీలకు వయస్సులో  ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌, ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. అంతేకాకుండా పరీక్ష విధానంలో..ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం 80 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్, సెక్ష‌న‌ల్ క‌టాఫ్‌ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: