కరోనా  వైరస్ కేసులు వెలుగు లోకి రావడం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుని తమ తమ రాష్ట్రా లలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం తో చివరికి విద్యా సంస్థలు కాస్త మూత పడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ విద్యా సంస్థలను  ప్రారంభించేందుకు ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చేయడం లేదు అయితే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ విద్యారంగం అయో మయం లోనే ఉంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.



 విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియక ఇక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అంతు  పట్టక అటు  విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యాశాఖ విద్యా సంస్థలను ప్రారంభించడం పై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు డిగ్రీ విద్యార్థులకు విద్యా బోధన సహా పరీక్షల నిర్వహణ గురించి క్లారిటీ రాలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు గందరగోళ పరిస్థితి నెలకొంది అయితే ఇటీవలే డిగ్రీ పరీక్షలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ ఇచ్చారు.



 డిగ్రీ విద్యార్థులు అందరికీ కూడా ఫిబ్రవరి 1 నుంచి జూన్  వరకు తరగతులు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఇక జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.ఉదయం బిఏ, బీకామ్ విద్యార్థులకు పరీక్షలు ఉంటే ఇక మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే అన్ని యూనివర్సిటీల లో కూడా హాస్టల్ సదుపాయాన్ని కూడా ప్రారంభించేందుకు నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీకి రావాలి నిబంధన లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: