సాధారణంగా రాయలసీమలో టీడీపీకి పెద్ద బలం ఉండదు. గతంలో సీమలో కాంగ్రెస్ హవా ఉండగా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం ఉంది. కానీ టీడీపీకి మాత్రం బలం చాలా తక్కువ కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ స్కోప్ లేదు. అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం మరీ ఎక్కువ బలం ఏమి లేదు. కానీ అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. మొదటి నుంచి జిల్లా టీడీపీకి అనుకూలంగా ఉంది. 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే, 12 టీడీపీనే గెలుచుకుంది. అటు 2 ఎంపీ సీట్లు సైతం టీడీపీనే గెలిచింది.

కానీ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగాలి వీచింది. అనంతలో కూడా వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో 12 సీట్లు వైసీపీ గెలిస్తే, టీడీపీ కేవలం 2 సీట్లే గెలిచింది. 2 ఎంపీ సీట్లు సైతం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఎన్నికలై దాదాపు 20 నెలలు దాటుతుంది. ఈ 20 నెలల కాలంలో జిల్లాలో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైనట్లే కనిపిస్తోంది. జిల్లాలో నేతలంతా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అధికార వైసీపీపై గట్టిగానే పోరాడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు పార్లమెంట్ సీట్లలో టీడీపీకి పట్టు దక్కినట్లే కనిపిస్తోంది. అనంత, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పుంజుకుంది.

అటు 14 అసెంబ్లీ స్థానాల్లో సగం స్థానాల్లో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉరవకొండ, హిందూపురం స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో టీడీపీకి పట్టు చిక్కినట్లు తెలుస్తోంది. కదిరి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుగొండ, తాడిపత్రి లాంటి స్థానాల్లో టీడీపీకి పాజిటివ్ కనిపిస్తోంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, వైసీపీకి పోటీగా ఉంటుంది. మొత్తానికైతే అనంతలో సైకిల్ స్పీడ్ పెరిగినట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: