ఆకుకూరల్లో ఆరోగ్యానికి మంచిది అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆకుకూరలను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆకుకూరలలో ముఖ్యంగా బచ్చలికూర పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. ఈ బచ్చలి కూరలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ బచ్చలి కూరను ఆహారంలో భాగంగా తినడం వల్ల లేదా సలాడ్ రూపంలోనైనా తీసుకోవటంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా.

అయితే బచ్చలికూర తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది.. ‘బచ్చలికూర తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్-ఏ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు మెదడు డ్యామేజిని ఆలస్యం చేస్తుంది’ అని న్యూ మెక్సికో స్టేట్ వర్సిటీలో ప్రజారోగ్య ప్రొఫెసర్ పీహెచ్ డీ జగదీశ్ ఖుబ్ చందాని అన్నారు. నిరాశ, మెదడు నిర్మాణాత్మక, క్రియాత్మక నష్టాన్ని తగ్గించడంలో బచ్చలికూర ఒత్తిడి నిరోధక ప్రభావాలకు ఆధారాలు కూడా ఉన్నాయి.

ఇక మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ తొలగిపోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా శరీరానికి అవసరమవుతాయి. ఫ్రీ రాడికల్స్ ను మన శరీరం నుంచి బయటకు పంపడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే మన శరీరానికి అవసరం అయ్యే యాంటీఆక్సిడెంట్లు బచ్చలికూరను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు పొందవచ్చు.

ఈ ఆకుకూరలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. విటమిన్-ఏ లోపం వల్ల కళ్ళు పొడిబారటం, రేచీకటి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు బచ్చలి ఆకును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల విటమిన్ ఎ సమృద్ధిగా లభించి కంటి సమస్యలను దూరం చేస్తాయి. బచ్చలి కూరను సూప్ గా తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక రక్తపోటు సమస్య నుంచి కాపాడుతుంది. బచ్చలి కూర వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: