తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయం వంటి రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్రం గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. అంతే కాదు.. అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలా జరిగింది అలా జరిగింది అంటూ చెప్పుకునే విజయ గాథలను ఇంతవరకు విన్నామని.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని.. తెలంగాణ యే రోల్ మోడల్ గా మారిందని కేసీఆర్ అంటున్నారు.

కేసీఆర్ ఇంకా ఏమంటున్నారంటే.. " రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నెంబర్ వన్ గా నిలవడం మిషన్ భగీరథ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణను, రిజిస్ట్రేషన్లను, మ్యుటేషన్లను సులభతరం చేసుకున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయన్నారు కేసీఆర్.

దేశంలో మరెక్కడా లేని విధంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయని... ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయని... డంప్ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు వచ్చాయని కేసీఆర్ అంటున్నారు.  ఇలా ప్రతీ రంగంలోనూ ఎన్నో అద్భుత విజయాలు తెలంగాణ రాష్ట్రం సాధించింది. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి” అని ముఖ్యమంత్రి  కెసిఆర్ అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం  అన్నారు సీఎం  కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: