కృష్ణ, గుంటూరు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కాస్త క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా సరే అనేక పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా ఉంటూనే ఉన్నాయి. రాజకీయంగా ఇప్పుడు కృష్ణ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంలేదనే  వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కొంతమంది నేతలను ఆయన ఎక్కువగా వదిలేశారని... సదరు నేతలు పార్టీని కూడా ఇబ్బందులు పెడుతున్నారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది అంటే కచ్చితంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న కొంతమంది కీలక నేతలు కారణం అని చెప్తూ ఉంటారు.

ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని కారణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బ్రతికే ఉంది. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా గల్లా జయదేవ్ కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది. కానీ వీళ్ళు ఇద్దరి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గల్లా వర్గానికి చెందిన ఒక కీలక నేతకు ఇటీవల తెలుగు యువత పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన సరే ఆ తర్వాత వెనక్కి తగ్గడం కాస్త ఇబ్బందిగా మారింది అని అంటున్నారు.

కేశినేని నానీ విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఒక నేత నుంచి ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ చంద్రబాబునాయుడు వైఖరి దెబ్బకు పదేపదే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన పెరిగిపోతుంది. మరి ఈ వివాదం చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిష్కరిస్తారు ఏంటి అనేది చూడాలి. గల్లా జయదేవ్ కి నారా లోకేష్ కి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: