తెలంగాణలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి రథయాత్రకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి అదిలాబాద్ వరకు ఆయన యాత్ర చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

అయితే ఇప్పుడు బండి సంజయ్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త కంగారు పడుతున్నారు. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందుత్వ వాదులను తమ వైపు తిప్పుకోవడానికి ఆఫర్లు ఇస్తున్నారు. రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని బండి సంజయ్ హామీ ఇస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాక పోయినా సరే త్వరలోనే కొంత మంది మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆయన ఇప్పటికే భేటీ అయినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం బండి సంజయ్ దెబ్బకు కు టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడటం ఖాయంగా కనపడుతోంది. బండి సంజయ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కాస్త గట్టిగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు అనేది తెలియకపోయినా ముగ్గురు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలను బండి సంజయ్ టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: