తెలంగాణలో ముఖ్య మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా దాదాపుగా వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. అయితే టిఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు సీఎంగా కేసీఆర్ మాత్రమే కొనసాగాలని లేకపోతే దళితున్ని సిఎం చేయాలని డిమాండ్ లు ఎక్కువగా వినబడుతున్నాయి. విపక్షాలు కూడా దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక్కడున్న పరిణామాల నేపథ్యంలో సీఎంగా కేసీఆర్ కాకుండా మరొకరు ఉంటే భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది.

ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వర్గ విభేదాలు కారణంగా ఇబ్బందులు పడతారు. టిఆర్ఎస్ పార్టీలో ముందునుంచి సీనియర్ నేతల హవా అనేది ఎక్కువగా ఉంది.  పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు సీఎంగా కేటీఆర్ ని చేస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అందుకే చాలామంది ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక తమ శాఖల మీద కూడా కొంతమంది మంత్రులు పెద్దగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం. మంత్రి హరీష్ రావు ఎలా వ్యవహరిస్తారో ఏంటనే దానిపై స్పష్టత లేదని టాక్. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ కు నివేదికలు పంపించారని సమాచారం.

అసలు సీఎం కేటీఆర్ ను ఇప్పటికిప్పుడు ఎంపిక చేయాల్సిన అవసరం లేదని అనవసరంగా కొత్త సమస్యలు పార్టీలోను ప్రభుత్వంలోను తెచ్చుకోవాల్సి ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. మరి సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సీఎం కేటీఆర్ గా వద్దని మీరే కొనసాగాలని సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: