మధ్య కాలంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంది.. అయితే ప్రభుత్వాలు నగరాలను పరిశుభ్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చెత్తను వేయడానికి కొన్ని ప్రత్యేక డబ్బాలను పెట్టారు. అయిన కూడా బయట వేయడానికి అలవాటు పడిన జనాలు చెత్తను రోడ్ల మీదనే వేస్తున్నారు.అలాగే, ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కడంటే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఎంతో కాలుష్యం విరజిమ్మేందుకు మనమే కారకులం అవుతున్నాం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కొత్త పంథాలో పోవాలని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆలోచన చేసింది. 



స్థానికంగా ఉండే ఒక మిఠాయి దుకాణం తో కలిసి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. అయితే, ఈ కార్యక్రమం అటు చెత్త ఏరుకునేవాళ్లకు కడుపు నిండా భోజనం దొరకడమే కాకుండా.. రోడ్ల పై ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపించకుండా పోయేలా చేస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌ జోన్‌లోని వర్ధమాన్‌ ప్లస్‌ సిటీ మాల్‌ ప్రాంతంలో స్థానిక డైమండ్ స్వీట్స్ యాజమాన్యం ఒక కొత్త కెఫెను ప్రారంభించింది. ఈ కెఫె ప్రత్యేకతలు ఏంటంటే.. ఎవరైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి వాటికి బదులుగా రుచికరమైన ఆహారం పొందవచ్చు. ఈ కెఫెలో అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనంతోపాటు మిఠాయిలు కూడా దొరుకుతాయి..



ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డిప్యూటీ కమిషనర్‌ రాధాకృష్ణ చెప్తున్నారు.'ఇంటి నుంచి వ్యర్థ ప్లాస్టిక్‌ను తీసుకురండి.. ఉచిత భోజనం పొందండి' అని నినాదాలు కూడా కెఫె గోడలపై మనకు కనిపిస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణం తెరుచుకుని ఉంటుందని డైమండ్ స్వీట్స్ యజమాని పూజా శర్మ తెలిపారు. కిలోల చెత్తను తీసుకొచ్చే వాళ్లకు స్వీట్స్ తో పాటుగా భోజనాన్ని కూడా అందించనున్నట్లు తెలిపారు.ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటిస్తారని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: