ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ  శర వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిన బర్డ్ ఫ్లూ ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన నేపధ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠిన  నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ప్రజలందరూ పక్షులకు దూరంగా ఉండాలని అంతేకాకుండా చికెన్, గుడ్లను కూడా నిషేధించాలంటూ ప్రభుత్వాలు నిబంధన తీసుకు వస్తున్నాయి. ఇక అదే సమయంలో బర్డ్ ఫ్లూ ఎంతో ప్రమాదకరం కావడంతో పక్షులకు దూరంగానే ఉంటున్నారు సాధారణ ప్రజలు.



 కానీ ఇటీవలే టీమిండియా స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ పక్షులపై ప్రేమ చూపించి చివరికి వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇటీవలే వారణాసి లో పర్యటించిన శిఖర్ ధావన్ అక్కడ గంగానదిలో బోటులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే నదిలో ఉన్న పక్షులకు ఆహారం అందజేశాడు శిఖర్ ధావన్. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ శిఖర్ ధావన్ ను  వివాదాల్లోకి నెట్టింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి శిఖర్ ధావన్ స్వయంగా తన చేతులతో పక్షులకు ఆహారం అందించడం పై  పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.



 అయితే నిబంధనలు ఉల్లంఘించి నదిలోకి బోట్  తీసుకెళ్లినందుకు గానూ బోట్  యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.  పర్యాటకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.  అయితే బోట్ నడిపే వారికిప్రభుత్వ నిబంధనల పై ఎంతో అవగాహన ఉన్నప్పటికీ బోట్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వారు అవగాహన కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ చేసిన పని కాస్తా ప్రస్తుతం వివాదాస్పదంగా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: