ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి మరియు ఎస్ఈసీ కి మద్య స్థానిక సంస్థల ఎన్నికలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.... వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. తన మాటల తూటాలతో నిమ్మగడ్డ రమేష్ ను టార్గెట్ చేశారు. ఎవరి ఒత్తిడితో, ఎవరి ప్రోత్సాహంతో నిమ్మగడ్డ అలా దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తున్నారో ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఉద్యోగుల మరియు ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఎవరి కోసమో ఇలా దిగజారుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఉద్యోగులు ముందుగా వ్యాక్సిన్ వేయించుకొని... వారికి రెసిస్టెంట్ పవర్ పెరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే న్యాయం కూడా అన్నారు. మనకున్న పదవిని మన ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచకూడదన్నారు. ప్రజల భద్రతపై మనకు బాధ్యత ఉందని గ్రహించాలన్నారు  ఎమ్మెల్యే రోజా. ఓవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది మరోవైపు వాక్సినేషన్ ప్రక్రియ మొదలయింది.

 ఇటువంటి సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఎన్నికలంటే భయం లేని వ్యక్తి  సీఎం జగన్ అని ఆమె పేర్కొన్నారు. 2018లో జరగాల్సిన ఎన్నికలకు భయపడి చంద్రబాబే పిరికిపందలా పారిపోయాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయం ఏదైతే దాన్ని పాటిస్తామన్నారు.

 కానీ నిమ్మగడ్డ నిర్ణయాలు మాత్రం ప్రజల భద్రతకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తెర వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారని... ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రోజా. నిమ్మగడ్డ రమేష్ తన పదవిని బాబోరిని సపోర్ట్ చేయడానికి వాడుతున్నారని...దీనికి బదులుగా ప్రజల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని రోజా దుయ్యబట్టారు...!

మరింత సమాచారం తెలుసుకోండి: