ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ సుందర్ భారత క్రికెట్ లో యువ సూపర్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.  జూనియర్ ఆల్రౌండర్ గా  జట్టులో స్థానం సంపాదించిన వాషింగ్టన్ సుందర్ తన బౌలింగ్లో అదరగొట్టి  కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు అదే సమయంలో..  అటు బాట్ తో కూడా అదరగొట్టి ఔరా అనిపించాడు అన్న విషయం తెలిసిందే. కీలక ఆటగాళ్లు అందరూ కూడా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న సమయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా రాణించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే ఇప్పటికికూడా వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఎలాంటి అనుభవం లేకుండా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి  జట్టుకు దూరమైన సమయంలో ఇక గెలుపు ఓటముల మధ్య  జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న  సమయంలో అద్భుతంగా ఒత్తిడిని చిత్తు చేస్తూ రాణించి  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అంటూ ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో భాగంగా మంచి బ్యాటింగ్ లైనప్ తో అలరించిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి  సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు వాషింగ్టన్ సుందర్. ఒకవేళ టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్ గా తనను పంపినప్పటికీ ఆడటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్లుగా బరిలోకి దిగడం తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.  అయితే అండర్ 19 ఆడుతున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ టాప్ ఆర్డర్లో ఒక స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా ఉండే వాడు ఇక ఆ తర్వాత.. ఆప్ స్పిన్నర్ గా మారిపోయాడు వాషింగ్టన్ సుందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: