ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కేంద్రం వద్ద నుంచి ఏం సాధిస్తారు అనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి కాక ముందు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధుల సాధిస్తామని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. దీంతో ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి భారీ ఎత్తున ఓట్లు వేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం మెడలు వంచడం సంగతి పక్కన పెడితే కేంద్ర పెద్దలు వస్తే ఆయన వంగిపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకు వస్తారా లేదా అనే దానిపై కూడా ఆసక్తి పెరిగిపోతుంది.

ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్రం అప్పుల పాలు కావడమే కాకుండా ప్రజలపై తెలియని భారం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్ సహా  నిత్యావసర సరుకుల ధరల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి... అభివృద్ధి కార్యక్రమాలన్ని చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. కేంద్ర పెద్దలు ఇప్పటికే రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో డ్రామాలాడుతున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం సహా అమరావతి అలాగే వెనుకబడిన జిల్లాల నిధులను భారీగా ఇవ్వాల్సి ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన కూడా తెలియజేయటం లేదు. గత ఏడాది బడ్జెట్లో కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చింది ఏమీలేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాత్రం జగన్ పై తీవ్రస్థాయిలో వైసీపీలో కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తి కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం  వద్ద నిధులు లేవు కాబట్టి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: