ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఆందోళన పెరిగిపోతుంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని ముందుకు వచ్చినా సరే ఇప్పుడు కొంతమంది వారిని వెనక్కి లాగుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు విధానాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి 2019 తర్వాత చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా కనుమరుగైపోయారు.

అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అనేది మనం చూస్తున్నాం. కొంతమందికి కీలక పదవులను కూడా ఇస్తుంది పార్టీ. ఇక పార్టీ కోసం కష్టపడిన చాలామందికి పదవులు రాకపోవడంతో ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి హడావుడి చేసే వాళ్ళను మాత్రమే పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని ఆందోళన చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

ఇదే కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే అనవసరంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడాలి. ఇంకా పార్టీలో కొంతమంది నాయకులతో సన్నిహితంగా ఉన్న వారు ఏ పని కావాలన్నా చేయించుకునే పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ నేతలతో కూడా సన్నిహితంగా మెలుగుతున్నారు. అలాంటి వారికి పదవులు దక్కుతాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు పార్టీనీ చంపేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో చాలా మంది కార్యకర్తలను ఇప్పుడు పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఇబ్బంది పెడుతున్న సరే చాలా మంది కార్యకర్తలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే కార్యకర్తలను పూర్తిగా వదిలేసారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: