ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.  మొన్నటివరకు కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్  ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన జనాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం వ్యాక్సిన్ పై  ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడిపోతున్నారు అనే విషయం తెలిసిందే .  ఇక వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు  కూడా అస్వస్థతకు గురి కావడం అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం కూడా వ్యాక్సిన్ పై  మరిన్ని అనుమానాలను భయాలు  కూడా తెర మీదకు వస్తున్నాయి.  ఇప్పటికే పలు ప్రాంతాలలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు మృతిచెందిన ఘటన లు  తెరమీదకు వచ్చాయి అనే విషయం తెలిసిందే.


 ఇక ఇటీవలే గుంటూరులో వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్  మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ విషయం వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక కు చెందిన బొక్క విజయలక్ష్మి ఆశా కార్యకర్తగా పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఈనెల 20వ తేదీన విజయలక్ష్మి వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ తర్వాత తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇక వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్పడంతో ఈ లక్షణాలను అంతగా పట్టించుకోలేదు ఆశ కార్యకర్త. ఆ తర్వాత ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.



 ఇక ఆమెను మెరుగైన  వైద్య సేవల కోసం ఈనెల 22వ తేదీన గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రికి తరలించగా ఇక ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ విభాగంలో  సేవలు అందించారు వైద్యులు. ఈ క్రమంలోనే బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడంతో  మృతి చెందింది.  ఈ విషయం తెలుసుకున్న అధికారులు పరుగున గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి వెళ్లారు. ఇక మృతురాలుకుటుంబ సభ్యులను పరామర్శించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: