కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగి పోయింది.. దాంతో చికెన్ రేట్లు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. అయిన కొనే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గలేదు.. ఇప్పుడు మళ్లీ చికెన్ రేట్లు పడి పోయాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యం లో తెలంగాణలో చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చేపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా చికెన్‌ వినియోగించే హైదరాబాద్‌ నగరం లో ఆదివారం అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. 



తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ చాలా మంది మాంసం ప్రియులు ఎందుకైనా మంచిదని చికెన్‌ తినడం మానేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్‌ నగరంలో రోజుకు 6లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుంది. అలాగే పండగలు, ఆదివారం నాడు అయితే చికెన్ కు గిరాకీ పెరిగేది..ఏకంగా 8 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయేదని, ఇప్పుడు నష్టాలను చూస్తున్నామని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..



ఇప్పుడు హైదరాబాద్ లో రేట్లు మరోసారి కిందకు దిగి వచ్చాయి.. నెల రోజులక్రిం కిలో చికెన్‌ ధర 220 రూపాయలు కాగా ప్రస్తుతం కిలో 140 నుంచి 150 రూపాయలకు పడిపోయింది. అలాగే ఫామ్‌ల వద్ద ఒక్కో కోడి ధర 60 నుంచి 70రూపాయలకు పడిపోయింది. జాతీయ ఆహార సంస్ధ తాజాగా కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఇందులో చికెన్‌ వినియోగించడం వల్ల బర్డ్‌ఫ్లూ రాదని స్పష్టంచేసింది. అయితే మాంసాన్ని బాగా ఉడిగికించి తినాలని, కోడిగుడ్లను హాఫ్‌ బాయిల్డ్‌ తినకూడదని నిబంధనల్లో స్పష్టంచేసింది.. రోజు రోజుకు రేట్లు తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు వాపోతున్నారు..ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇలానే ధరలు కొనసాగితే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాలని అంటున్నారు. ఈ వ్యాధి పట్ల ప్రభుత్వం ఏదోకటి చేయాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: