రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ ఇపుడు జన సామాన్యంలోకి వెళ్ళిపోయింది. ఏపీలో రాజ్యాంగం గురించి జనాలకు అవగాహన‌ ఎంతో కొంత ఉంది. ఇపుడు తాజా పరిణామాలు దాని మీద పూర్తి అవగాహన కల్పించాయి. రాష్ట్రంలో ఇపుడు ఒక వైపు రాజ్యాంగ బద్ధ సంస్థగా ఎన్నికల సంఘం ఉంది. మరో వైపు ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఉంది. ఈ రెండూ కూడా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలి కానీ ఇపుడు ఎవరి వ్యక్తిగత ఇగోలతో వారు కధను ఇంతదాక తీసుకువచ్చారు.

ఇపుడు ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే సమయంలో ఎన్నికలు వద్దు అంటూ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని ఎస్ఈసీ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో చూసుకుంటే ఎవరి అహంకారంతో వారు వ్యవహరిస్తున్నారు అన్నది సగటు ప్రజలకు అర్ధమైపోతోంది.

ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మారుతోంది. దీంతో ఎవరు గెలిచినా ఓడినా రాజ్యాంగ స్పూర్తి దెబ్బతినేలా వ్యవహారం ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చే తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా రెండవ వారు సహకరిస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా లేదా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఏపీలో రెండు కీలకమైన రాజ్యాంగ వ్యవస్థలు గత ఏడాదిగా సంఘర్షించుకోవడం అంతా చూస్తున్నారు. కోర్టులు కూడా చాలా సార్లు ఆదేశాలు జారీ చేశాయి. ఇపుడు సుప్రీం కోర్టు తీర్పు కధను క్లైమాక్స్ కి చేర్చేదిగా ఉంటుందని అంటున్నారు. దేశంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి గతంలో తలెత్తకపోవడంతో అంతా దీని మీదనే చర్చించుకుంటున్నారు.  ఈ మొత్తం వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్న టెన్షన్ కూడా అందరిలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: