తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యేల నుంచి సహకారం రావడం లేదనే వ్యాఖ్యలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు కొన్ని విధాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ మాట కూడా లెక్క చేయడం లేదని అంటున్నారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వ్యాపారం చేయడం కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలఉ వచ్చే ఎన్నికల్లో సీట్లు వచ్చే అవకాశం లేదని సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలను పూర్తిగా వదిలేసి వ్యాపారాలు మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

సీట్లు వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్ వద్ద మంచి పేరు లేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నియోజకవర్గాలను పూర్తిగా వదిలేసి ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీటు రాకపోతే ఇబ్బంది పడతాము అని కొంతమంది వద్ద ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల్లో కాస్త గట్టిగా పని చేయడానికి చూస్తున్నారు. ఇక సీటు రాదు అనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

సీఎం కేసీఆర్ ని భారతీయ జనతా పార్టీ నేతలు నానా మాటలు అంటున్నా సరే ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండటం వెనుక అసలు వ్యూహం ఏంటో కూడా చాలావరకు అర్థం కావడం లేదు. మంత్రులు కూడా పెద్దగా మాట్లాడలేదు. మంత్రివర్గం నుంచి బయటకు వెళ్లి పోతాము అనుకున్న వాళ్ళు అయితే అయితే అసలు హైదరాబాద్ లో మాత్రమే ఉంటున్నారని జిల్లాలకు కూడా వెళ్లడం లేదని సమాచారం. మరి దీని మీద సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు టిఆర్ఎస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: