జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తం గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తెలంగాణ రాష్ట్రం లో కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా మొదట వ్యాక్సిన్  అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే.. కరోనా  వ్యాక్సిన్ కరోనా వారియర్స్ కి  ముందుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంది.


 ఈ క్రమం లోనే మొదట విడతలో భాగం గా ప్రభుత్వ హెల్త్ వర్కర్లు అందరికీ కూడా వ్యాక్సిన్  అందించింది ప్రభుత్వం. ఈ క్రమం లోనే ఎంతో మంది హెల్త్ వర్కర్లు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఇక ఇటీ వలే మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.



ప్రైవేట్ ఆస్పత్రి లో పనిచేసే 1.54 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనవరి 16వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే హెల్త్ వర్కర్లు అందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా దాదాపు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమం లో నే అటు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రి లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ సిబ్బందిని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. 59 వేల మంది రెవెన్యూ సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అందించాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: