గుంటూరు జిల్లాలో గత ఎన్నికలలో అధికార వైసిపి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటి అనే దానిపై మాత్రం చాలా అనుమానాలున్నాయి. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే అమరావతి ఉద్యమం అనేది గుంటూరు జిల్లాలో ప్రధాన ఎజెండాగా మారింది. అమరావతి ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో వైసీపీ విస్మరించింది అనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి అమరావతి ఉద్యమం విషయంలో వైసీపీ ఎమ్మెల్యే లు ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.

అయితే అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు వైసిపి కచ్చితంగా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నా సరే అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం మీడియాతో కూడా ఆయన మాట్లాడలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేయడం మినహా ఆయన పెద్దగా ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి లేదు అనే విషయం చెప్పవచ్చు.

ఉండవల్లి శ్రీదేవి కూడా ఇప్పుడే ప్రజల్లోకి పెద్దగా రావడం లేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం అమరావతి లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రజల్లోకి రాకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా చాలావరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి వెళ్ళడంలో, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మాత్రం కచ్చితంగా అధికార పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు ఉన్నాయి. దీని మీద సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సి ఉందని ఎమ్మెల్యేలకు కొన్ని సహకారాలు అందించవలసిన అవసరం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: