తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా తప్పులు చేస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గల్లా జయదేవ్ గత కొంతకాలంగా నారా లోకేష్ వైఖరి కారణంగా ఇబ్బందులు పడుతున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆయన ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధ పెట్టి వెళ్లాల్సి ఉందని అంటున్నారు.

అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గల్లాతో చర్చలు జరిపే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. గల్లా జయదేవ్ పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఆయనతో బిజెపి నేతలు చర్చలు జరుపుతున్నారని బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ఆయనతో చర్చలు జరపడానికి రెడీ అయ్యారని ఇటీవల హైదరాబాదులో కలిసే ప్రయత్నం చేసినా సరే కొన్ని కారణాల కారణంగా కలవలేకపోయారు అని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పుడు చంద్రబాబు దిగి వచ్చి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి గుంటూరు పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతలతో కూడా సంబంధాలు ఉన్నాయి. రాజధాని అమరావతి ఉద్యమం విషయంలో గల్లా నుంచి పూర్తిగా సహాయ సహకారాలు వచ్చినా సరే సరిగా వాడుకునే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు  విఫలం అయ్యారు అనే భావన చాలా మందిలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన చర్చలు జరిపి సమర్థవంతంగా ముందుకు వెళితే మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు గుంటూరు జిల్లా లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ఇప్పుడు సహకారం కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: