రాజకీయాల్లో వ్యూహాలు ఎపుడూ ఉంటాయి. కానీ సమయానుకూలంగా కొన్ని మాత్రమే పారుతాయి. అన్ని వేళలా అన్ని వ్యూహాలూ పారితే రాజకీయ చాణక్యుడు చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు. అందువల్ల గెలుపుకు ఎపుడూ కొత్త కొత్త దారులే వెతుక్కోవాలన్న మాట.

విశాఖ విషాయనికి వస్తే విజయసాయిరెడ్డినే వైసీపీ మొత్తంగా నమ్ముకుంది. జగన్ కుడి భుజంగా పేరు సంపాదించిన విజయసాయిరెడ్డి విశాఖలో చక్రం తిప్పుతున్నారు. ఆయన గత ఆరేళ్ళుగా విశాఖలోనే మకాం వేసి ఇక్కడ పార్టీ రాజకీయాలను చక్కబెడుతున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తెచ్చింది కూడా విజయసాయిరెడ్డి కావడం విశేషం.

ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి మీద ఇపుడు మొత్తం పంచాయతీ ఎన్నికల భారం పడుతోంది. విజయసాయిరెడ్డి తన భుజ స్కందాల మీద గెలుపును ఎత్తుకోవాల్సి వస్తోంది.విశాఖ రూరల్ జిల్లా మొత్తంగా వైసీపీకి 2019 ఎన్నికల్లో జై కొట్టింది. అందువల్ల ఆ మ్యాజిక్ రిపీట్ చేయాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డి మీదనే ఎక్కువగా ఉంది అంటున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పధకాలు పెద్ద ఎత్తున అమలు చేశారు. దాంతో గ్రామ సీమలకు ఆ ఫలాలు ఫలితాలు దక్కాయని వైసీపీ పెద్దలు అంటున్నారు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ జనాల అభిప్రాయం ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది. గత ఫలితాలు కనుక పునరావృత్తం కాకపోతే మాత్రం విజయసాయిరెడ్డి కి గట్టి షాక్ తగిలినట్లేనని చెప్పాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరో వైపు చూస్తే విశాఖ జిల్లా వైసీపీలో వర్గ పోరు ఉందని వార్తలు వస్తున్నాయి. వాటి సర్దుబాటుకు ఇంతకాలం సీరియస్ గా పార్టీ దృష్టి సారించలేదు అన్న మాట కూడా ఉంది. ఇపుడు అనూహ్యంగా స్థానిక ఎన్నికలు తోసుకువచ్చాయి. దాంతో పార్టీ మొత్తాన్ని ఏక త్రాటి మీద నడిపించాల్సిన బాధ్యత కూడా విజయసాయిరెడ్డి మీదనే ఉంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: