నిన్న అంటే రిపబ్లిక్ డే రోజు జరిగిన దురదృష్టకర పరిస్తితులను పరిశీలిస్తూ - దేశ రాజధాని ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఒక విజ్ఞుడుగా స్పందించారు. హేచ్చరిక చేశారు. అదేమంటే:

"బీజేపీ నేతలు ఇకనైనా మేలుకోవాలి"  అని ఆయన పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన  ఇవాళ ఉదయం ట్విటర్‌లో వరుస పోస్టులు పెట్టారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ ‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న "దమ్మున్నోళ్ళు లేదా బలవంతులు" అనే ముద్రకు తీవ్ర నష్టం వాటిల్లిందని - రైతుల ఆందోళన కారణంగా ఇద్దరు రాజకీయ భాగస్వాముల గౌరవానికి నష్టం వాటిల్లింది.

ఒకటి: పంజాబ్ కాంగ్రెస్, అకాలీదళ్ నాయకులు వారి మధ్యవర్తులు.

రెండు: ప్రధాని నరేంద్ర మోదీ - హోం మంత్రి అమిత్ షా లకు ఉన్న "దమ్మున్నోళ్ళు - బలవంతులు" అనే ముద్రకు తీవ్ర విఘాతం కనీసం వాటికి మకిల పట్టిందని సుబ్రహ్మణ్యస్వామి భావన

ప్రయోజనం పొందిన వారుమాత్రం: తీవ్రవాదులు మరియు దేశద్రోహులైన నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐఎస్, ఖలిస్తానీలు దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి.." అని సుబ్రమణ్య  స్వామి ట్వీట్ చేశారు.


"దేశ రాజధానిలో శాంతి భద్రతల తీవ్ర విఘాతం జరగటమే కాదు వైఫల్యం చెందాయని స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందు గానే పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని ఆయన గుర్తుచేశారు.

"భారత్‌ ను మరింత బలహీన పరిచేందుకు మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు  హిందువులను ముట్టడి చేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి" అని ఆయన ట్వీట్ లోహెచ్చరించారు.

రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... "ట్రాక్టర్ ర్యాలీ " పేరుతో తాజాగా డిల్లి నగరంలోకి దూసుకెళ్లడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న భారత్ - చైనా యుద్ధానికి ముందుగనే దేశాన్ని బలహీన పరిచే ప్రణాళికలో ఇది ఒక భాగమని సుబ్రహ్మన్య స్వామి మాటలను బట్టి మనం మనం గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: