ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో నాలుగు విడుతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవాలుగా మార్చాలని వైసీపీప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. అలా జరగకుండా అడ్డుకునేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ వ్యూహరచన చేస్తున్నారు. ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి ఐపీఎస్ అధికారి డాక్టర్‌ సంజయ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇంతకీ ఈ సంజయ్‌ ఎవరు ? ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఆయనేం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల తో పాటుగా , ప్రజల్లో కూడా ఆసక్తి మొదలైంది.



ఇకపోతే గత ఏడాది పంచాయితీ ఎన్నికలలో జరిగిన ఏకగ్రీవాల వల్ల అనేక రచ్చలు జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది అలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు దిగడం ద్వారా పంచాయతీలను ఏకపక్షం చేస్తున్నాయని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈసారి అలా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఈసీ పకడ్బందీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెర మీదకు వినిపిస్తున్న పేరు సంజయ్..



బలవంతపు ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తామని చెప్పిన ఎస్ఈసీ.. ఐపీఎస్‌ సంజయ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో ఆయన నిన్న నిమ్మగడ్డ సమక్షంలోనే బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పంచాయతీ పోరులోకి కాలుమోపారు. ఎప్పుడైతే రాష్ట్రంలో బలవంతపు ఏకగ్రీవాలు అడ్డుకునేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటించారో అప్పుడే కీలక హోదాల్లో లేని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ను ఎంచుకుంటారని తేలిపోయింది. జగన్ సర్కారులో కీలకంగా లేని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో ఒకరైన డాక్టర్‌ సంజయ్‌ను నిమ్మగడ్డ ఎంచుకున్నారు. 



ఇంతకీ సంజయ్‌ ఎవరు, ఆయన్ను నిమ్మగడ్డ ఎందుకు ఎంచుకున్నారనే దానికి సమాధానం ఇచ్చేలా ఉంది. పలు కేసులను డీల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే , ఏకగ్రీవాలను అడ్డుకుంటారా? లేదా ? అన్న అంశం ఆసక్తిగా మారింది.మరోవిధంగా చెప్పాలంటే నిమ్మగడ్డ తర్వాత కమిషన్‌లో టాప్ టూ స్ధానం కూడా ఆయనదే. దీంతో నిమ్మగడ్డతో పాటు సంజయ్ తీసుకునే నిర్ణయాలు కూడా కీలకం కాబోతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: