అమరావతి: చిరంజీవి, పవన్ కల్యాణ్ మళ్లీ ఒకటి కానున్నారా..? రాజకీయాల్లో పవన్ కు చిరంజీవి అండగా నిలబడనున్నారా..? జనసేన నేత నాదెండ్ల మనోహర్ అవుననే చెబుతున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో అండగా ఉంటానని చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో పవన్ కు తోడుగా ఉంటానని, తన వంతు బాధ్యతగా మద్దతు అందిస్తానని చిరు చెప్పారన్నారు.

సినిమాల్లోకి తిరిగి రావాలని కూడా చిరంజీవే పవన్ కల్యాణ్ సూచించారని, ఆయన సూచన తోనే పవన్ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించా చదువుతున్నావారని అమౌంట్ మనోహర్ వెల్లడించారు. దీంతో ఈ వార్త పెద్ద సంచలనమైంది. ఈ మధ్యనే తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి.. మళ్లీ తమ్ముడికి అండగా ఉంటాననడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయపరంగా నైతిక మద్దతు మాత్రమే ప్రకటిస్తారా..? లేక ఆయన కూడా పార్టీలో చేరతారా అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. తిరుపతి ఎన్నికలకు ముందు నాదెండ్ల ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో జనసేన తరపున చిరంజీవి ప్రచారం చేసే అవకాశం కూడా ఉండవచ్చని కొందరు అంటున్నారు. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని అట్టహాసంగా స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కేవలం 18 సీట్లు మాత్రమే సంపాదించి రాజకీయంగా భారీ ఓటమిని చవిచూశారు. ఈ ఓటమి తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కొన్నాళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీతో చిరంజీవి ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే పార్టీని నడిపించారు.

కొన్నాళ్ళకు మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ పార్టీలో చేరారు. కానీ చిరంజీవి మాత్రం తమ్ముడి పార్టీపై ఏమాత్రం స్పందించలేదు. దీనికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా తను రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానని, సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తానని చిరంజీవి అన్నారు. ఇలాంటి సందర్భంలో చిరంజీవిపై నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: