ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టత వచ్చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిణామాల నేపధ్యంలో ఈ ఎన్నికల వ్యవహారం అనేది కీలకంగా మారింది. ఎపి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కోసం అన్ని సిద్దం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పుడు అధికారులు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కొందరు అధికారులు ఇబ్బంది పెట్టినా సరే ఇప్పుడు దారిలోకి వచ్చారు. బిజెపి కూడా ఈ ఎన్నికల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇతర పార్టీ ల అభ్యర్థులు పోటీలో ఉండకూడదనే విధానం సరి కాదు అని మండిపడ్డారు. గతంలో జరిగిన బెదిరింపులు వంటి వాటిని నిరోధించాలి అని ఆయన కోరారు. మేము ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ పై చర్చించుకుంటాం అని అన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే గవర్నర్ దృష్టి కి తీసుకెళతాం అని స్పష్టం చేసారు. బిజెపి, జనసేన సంయుక్తంగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తాయి అని స్పష్టం చేసారు.

ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసేలా చేయాలని మేము కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక విధాలుగా అభ్యర్థులను అడ్డుకున్నారు అని సోము మండిపడ్డారు. 29వ తేదీ లోగా ఆన్ లైన్ విధానం‌ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి పై మాకు స్పష్టమైన విధానం ఉంది అని అన్నారు. ఇరు పార్టీలు పొత్తుతో... అందరకీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఇరు పార్టీ లకు ఎక్కడెక్కడ ఎంత బలం ఉందో చూసి.. అభ్యర్థులను ఎంపిక చేస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: