తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పార్టీ అసలు ప్రజల ముందుకు ఏ విధంగా రావాలో అర్ధం కాని  పరిస్థితిలో ఉంది. రాజకీయంగా దుబ్బాక ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారు అయింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కనీసం ఆ పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించినా సరే ఆ పార్టీ మాత్రం అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు చాలా వరకు కూడా గ్రేటర్ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ నేతలను ప్రజలు కూడా పెద్దగా ఆదరించే పరిస్థితి లేదు.

ఇక కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బిజెపి సహా తెరాస పార్టీలు అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే... మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజల ఊసురుతోనే  కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్  ప్రాజక్టుల డిజైన్ చేసింది  అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదు అని అన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. ఉత్తమ్ తన ఎంత ఎత్తు అవినీతిలో కూరుకుపోయాడు అని ఆయన మండిపడ్డారు. జైల్ కు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకుంది అని అన్నారు. ఫ్లోరిన్ నుంచి నల్లగొండ జిల్లాను రక్షించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: