తెలంగాణ లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న వార్త ప్రజల్లో , కార్యకర్తల్లో కొంత సంతోషం నింపుతుంది.. అయితే ఈ వార్త ప్రతిపక్షాలకు ఏమో కానీ సొంత టీ ఆర్ ఎస్ నేతలకు మాత్రం నచ్చడం లేదనిపిస్తుంది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గరినుంచి కేసీఆర్ పార్టీ కి, రాష్ట్రానికి నాయకత్వం వహించారు.. అయన చెప్పిందే వేదంలా చేశారు నేతలు.. ప్రజలు కూడా కేసీఆర్ కి ఎక్కడ వ్యతిరేకం అవ్వలేదు. అటు కేసీఆర్ కూడా అందరికి ఉపయోగపడే పనులే చేశారు.. కానీ సడెన్ గా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దిగిపోతున్నారని వార్తలు రావడంతో కొంతమంది తెరాస నేతలు, మరికొంతమంది ప్రజలు సంతృప్తి గా లేరని విశ్వనీయ వర్గాల సమాచారం..

ఈ నేపథ్యంలో దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ బహిరంగంగా చెప్పేశారు. కే‌టి‌ఆర్ ని సి‌ఎం చెయ్యడానికి కే‌సి‌ఆర్ అన్నీ పూజలు చేశాడు. ఆ పూజా సామగ్రిని తీసుకెళ్ళి కాళేశ్వరం లో కలిపి వచ్చాడు.త్వరలో కే‌టి‌ఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయంను డిల్లీకి వెళ్ళి కేంద్ర బి‌జే‌పి పెద్దలకు చెప్పి వచ్చాడు అని చెప్పాడు.  కావాలనే కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ మంత్రులతో బి‌జే‌పి నేతల సపోర్ట్ మాకు ఉన్నదని చెప్పిస్తున్నాడు.ఆ విషయంను ఎవరు నమ్మోదని అన్నాడు.

కే‌సి‌ఆర్ కి ఓ సవాల్ విసురుతున్న కేంద్ర బి‌జే‌పి నేతల సఫోర్ట్ ఆయనకు ఉంటే ఇద్దరం డిల్లీకి వెళ్ళి అమిత్ షా, జే‌పి నడ్డ,మోడీ వంటి నేతలను కలుద్దాం ఆ దమ్ము కే‌సి‌ఆర్ కు ఉందా అంటూ సవాల్ విసిరాడు.కే‌టి‌ఆర్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని టి‌ఆర్‌ఎస్ లోని కొంతమంది మంత్రులు ఎం‌ఎల్‌ఏ లకు నచ్చడం లేదని అన్నాడు. ఆయన సి‌ఎం అయిన వెంటనే పార్టీలో పెద్ద బాంబే పేలుతుందని అన్నాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ విషయంపై ఓ సారి పునరాలోచిస్తారా అన్నది చూడాలి. కెసిఆర్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోరు.. ఈనేపథ్యంలో అయన ఏం ఆలోచిస్తాడో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: