బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గత కొంత కాలంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు అని మండిపడ్డారు.  ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అని ఊరించి ఊరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు అని మండిపడ్డారు. అందరినీ మోసం చేసే.. ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను.. ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు అని మండిపడ్డారు.

7.5 శాతం పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా.. మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా అని ప్రశ్నించారు. అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా.. స్వతంత్రంగా పని చేయనిచ్చారా అని నిలదీశారు. ఫాం హౌజ్ ల కూసోని పీ ఆర్ సి రాయించినవా కేసీఆర్ అని నిలదీశారు. ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేసి.. ఆ కమిటీ ఏం రాయాలే.. ఎంత రాయాలే.. ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించ్చారు అని మండిపడ్డారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్ ఆర్ ఏ 6 శాతం తగ్గించటం దారుణం అని మండిపడ్డారు.

మోసం.. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగుల ను మోసం చేసినవ్.. 7.5 పీ ఆర్ సి ఇచ్చి సి పీ ఎస్ 10 శాతం తగ్గిస్తారు అని అన్నారు. 30 శాతం ఉన్న సీపీ ఎస్  ఉద్యోగికి ఈ పీ ఆర్ సి ద్వారా జీతం పెరగదు.. పైనంగ 2.5 శాతం జీతం తగ్గుతది అని అన్నారు. 31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా.. ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43 శాతం ఫిట్ మెంట్ ఇయ్యాలి అని డిమాండ్ చేసారు. ఉన్న ఉద్యోగులు మన జనాభా కు సరిపోయినట్లు వున్నారా అని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన లేరు అన్నారు. ఉద్యోగులపై పని భారం పెరిగింది.. ఇంకా కమిటీలు.. రిపోర్ట్ లు అని కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: